Advertisement

తెలంగాణలో మద్యం ధరల పెంపు.. జూన్ 2 తర్వాత కొత్త రేట్లు

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో మద్యం సేవించే వారికి త్వరలో భారీ షాక్ తగలనుంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తర్వాత లిక్కర్ ధరలను 15 నుంచి 20 శాతం వరకు పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ప్రైస్ ఫిక్సింగ్ కమిటీ తన నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించింది.

కొత్త రేట్ల ప్రకారం సాధారణ బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై రూ.60, ప్రీమియం విస్కీ, వోడ్కాపై రూ.100, హైఎండ్ బ్రాండ్లపై రూ.120కి పైగా పెంపు ఉండనుంది. పశ్చిమ ఆసియా సంక్షోభంతో ఎల్‌పీజీ కొరత ఏర్పడి గాజు బాటిళ్ల తయారీ ఖర్చులు పెరిగాయని డిస్టిలరీలు చెబుతున్నాయి. రవాణా వ్యయాలు కూడా పెరగడంతో 30 శాతం ధరలు పెంచాలని మద్యం తయారీ సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి.

Advertisement

అయితే సామాన్య వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడకుండా చౌక మద్యం ధరలను మాత్రం పరిమిత స్థాయిలో పెంచాలని అధికారులు భావిస్తున్నారు.

Advertisement