Advertisement

కుటుంబంతో ఆస్ట్రియా వెకేషన్లో అల్లు అర్జున్

మన పత్రిక: టాలీవుడ్ అగ్రనటుడు అల్లు అర్జున్ తన రాబోయే సినిమా ‘రాకా’ షూటింగ్ నుంచి చిన్న విరామం తీసుకుని, తన కుటుంబంతో కలిసి ఆస్ట్రియాలో విహారయాత్రకు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు భార్య అల్లు స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హ ఉన్నారు.

ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను స్నేహారెడ్డి సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైరల్ అవుతున్నాయి. ఈ కుటుంబం ఆస్ట్రియాలోని ఇన్స్‌బ్రక్ నగరంలో ఉన్న ప్రసిద్ధ సీగ్రూబ్ వ్యూపాయింట్‌ను సందర్శించింది. మంచు కొండలు, అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ప్రశాంతంగా సమయాన్ని గడుపుతున్నారు. ఈ విహారయాత్ర ముగిసిన వెంటనే ఆయన తిరిగి భారత్‌కు చేరుకుని, అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాకా’ షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.

Advertisement
Advertisement