Advertisement

రేపటి నుంచే తెలంగాణ శాసనసభ సభలు

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్స్ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనున్నాయని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. భద్రతా దృష్ట్యా పోలీసు, ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. సభల నిర్వహణకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని స్పీకర్ కోరగా, అన్ని రకాల ప్రభుత్వ సమాచారాన్ని త్వరితగతిన అందిస్తామని అధికారులు వెల్లడించారు.

ఈ విడత సమావేశాల్లో ప్రధానంగా యువతకు చట్టసభల్లో అవకాశం కల్పించేందుకు 21 ఏళ్లకే పోటీ చేసే ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలు ఆర్టికల్ 84(b), 173 (b) ప్రకారం ప్రస్తుతం కనీస వయస్సు 25 ఏళ్లుగా ఉంది. దీని సవరణకు పార్లమెంట్ ఆమోదం అవసరం కాబట్టి, రాష్ట్ర శాసనసభలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపనున్నారు. దీంతో పాటు క్యూర్, 22ఏ భూములు, భూసేకరణ, హైడ్రా పరిధి, సాగునీటి ప్రాజెక్టులు మరియు ఆస్తిపన్ను విధానంపై సభలో తీవ్రస్థాయి చర్చ నడిచే సూచనలు కనిపిస్తున్నాయి.

Advertisement
Advertisement