Advertisement

తెలంగాణలో గరిష్ఠ స్థాయికి రిటైల్ ద్రవ్యోల్బణం

మన పత్రిక, హైదరాబాద్: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం గత ఆరు నెలల్లోనే అత్యధిక స్థాయికి చేరుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా నివేదికలో వెల్లడించింది. జూన్ నెలలో దేశవ్యాప్తంగా నమోదైన ఈ ద్రవ్యోల్బణం గణాంకాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రం 6.36 శాతంతో దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం కలిగిన ప్రాంతంగా నిలిచింది.

రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే, తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు పుదుచ్చేరి ప్రాంతాలు చెరో 5.39 శాతం ద్రవ్యోల్బణంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఆహార పదార్థాలు, రవాణా ఖర్చులు, బంగారం మరియు వెండి వంటి విలువైన లోహాల ధరలు గణనీయంగా పెరగడం ఈ పరిస్థితికి ప్రధాన కారణమని ఆర్బీఐ పేర్కొంది. దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం ఆశించిన 4 శాతం లక్ష్యాన్ని మించి నమోదైంది.

Advertisement
Advertisement