మన పత్రిక, వెబ్‌డెస్క్
Telangana News : తెలంగాణ రైతు ఈసారి చరిత్ర సృష్టిస్తున్నాడు. కాళేశ్వరం ( Kaleshwaram ) మెడలు విరిగినా, బరాజ్‌లు పనికిరాకుండా ఉన్నా… 67 లక్షల ఎకరాల్లో వరి సాగుతో కొత్త రికార్డు నమోదు చేశాడు. సాధారణంగా 56 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉంటుంది. కానీ ఈసారి 11 లక్షల ఎకరాలు అదనం. మొత్తం సాగు 1.32 కోట్ల ఎకరాలను దాటింది. ఈ పెరుగుదల కాళేశ్వరం వల్ల కాదు. ప్రాజెక్టు ఇంకా పూర్తిగా వినియోగంలోకి రాలేదు. అయినా రైతు ముందుకు సాగుతున్నాడు.
బీఆర్ఎస్ నేతలు చెప్పే 15 లక్షల ఎకరాల వరి సాగు గణాంకం తప్పు. 2013-14లోనే 50 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉండేది. రేవంత్ ప్రభుత్వం సన్నబియ్యానికి బోనస్ ధర ఇస్తోంది. రేషన్ లో సన్నబియ్యం ఇవ్వడంతో డిమాండ్ పెరిగింది. ఫలితంగా రైతులు సన్నాల సాగు పెంచుతున్నారు. మార్కెట్ ధరలు కూడా తగ్గాయి. వరి, మొక్కజొన్న సాగు పెరిగింది. కానీ పత్తి, చిరుధాన్యాలు, నూనెగింజల సాగు తగ్గుతోంది. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి. యూరియా సరఫరాలో కేంద్రం సహకరించాలి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
