ప్రముఖ IT సంస్థ అయిన టెక్ మహీంద్రా వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలో ఉన్న టాప్ మల్టీనేషనల్ కంపెనీల్లో ఇది ఒకటి. ఎన్నో వేల మంది ఈ కంపెనీలో ఉద్యోగాల కోసం కలలు గంటూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే ప్రతి పది మందిలో ఒకరు ఈ కంపెనీలో ఉద్యోగం చేయాలని టార్గెట్ పెట్టుకుంటారు. ఇక తాజాగా టెక్ మహీంద్రా లో కస్టమర్ సపోర్ట్ కోసం ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ ఐటీ సంస్థ అయిన టెక్ మహీంద్రా లో “అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ రిప్రెసెంటేటివ్” (Associate Customer Support Representative) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా హైదరాబాద్ (Hyderabad) లోనే ఈ జాబ్స్ పోస్టింగ్ ఉండనున్నాయి. ఇక క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే… ఏ విభాగంలోనైనా డిగ్రీ (Graduation) పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగానికి అర్హులు. ఇక ఫ్రెషర్స్ తో పాటు రెండేళ్ల అనుభవం (2 years) ఉన్న వారందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఇక టెక్ మహీంద్రా లో కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలకు ఫిబ్రవరి 16th నుండి 27th ఫిబ్రవరి (February) వరకు ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. డైరెక్ట్ గా టెక్ మహీంద్రా ఆఫీసుల్లో వాకిన్ డ్రైవ్ జరగనుండగా, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు వారి వారి సర్టిఫికెట్లతో ఉదయం 10.00 AM నుండి మధ్యాహ్నం 2.00 PM వరకు టెక్ మహీంద్రా ఆఫీస్ లో ఉండాలి. మరిన్ని వివరాలకు కింది లింక్ ని ఉపయోగించండి.
More Details: https://tinyurl.com/4ashh7sy
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- Railway Jobs 2026: రైల్వేలో 4,098 ఉద్యోగాలు.. ఏయే పోస్టులు? పూర్తి వివరాలు
- విద్యార్థులకు పండుగల పండగ.. ఆగస్టు సెలవుల లిస్ట్ వచ్చేసింది! | Telangana School Holidays August 2026
- పెరూలో 5.3 తీవ్రతతో భూకంపం సునామీ ముప్పు లేదని స్పష్టత
- ఈనెల 24న ఎల్లారెడ్డిలో మెగా జాబ్ మేళా
- ఆగస్టు 07 రాశిఫలాలు: ద్వాదశ రాశుల వారి ఫలితాలు, సూచనలు
