మన పత్రిక వెబ్‌డెస్క్, సూర్యాపేట: సూర్యాపేట పట్టణ ప్రధాన రహదారిపై ఇష్టారాజ్యంగా వెలసిన ఆక్రమణలను పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సంయుక్తంగా తొలగించారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు అధికారులు ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై సాయిరాం మాట్లాడుతూ.. వ్యాపారులు రోడ్లను ఆక్రమించి దుకాణాలు నిర్వహించవద్దని హెచ్చరించారు. మున్సిపల్ సిబ్బంది సహకారంతో రోడ్లపైకి వచ్చిన షాపుల సామగ్రిని, మట్టి కుప్పలను క్లియర్ చేశారు. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ ఆక్రమణల తొలగింపుతో మెయిన్ రోడ్డుపై రాకపోకలు సాగించే వేలాది మంది వాహనదారులకు, పాదచారులకు ట్రాఫిక్ కష్టాలు భారీగా తప్పనున్నాయి. ప్రజలు, వ్యాపారులు తమ వస్తువులను రోడ్ల మీదికి తెచ్చి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
భవిష్యత్తులోనూ ట్రాఫిక్ నియంత్రణకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
- CM Revanth Reddy భారీ యాక్షన్ ప్లాన్.. 99 రోజుల పాటు ‘ప్రజా పాలన – ప్రగతి’!
- బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. 25 దుకాణాలు దగ్ధం, రూ.5 కోట్ల నష్టం!
- Balka Suman Bail: జైలు నుంచి బాల్క సుమన్ రిలీజ్.. కోర్టు విధించిన షరతులు ఇవే!
- హీరోయిన్లను ఆ యాంగిల్స్‌లో ఫోటోలు తీస్తారా? కెమెరామెన్లపై ‘కాంతార’ సప్తమి గౌడ సంచలన వ్యాఖ్యలు!
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్‌తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
