Advertisement

ఆదిలాబాద్‌లో విద్యార్థి సూసైడ్

TG: ఆదిలాబాద్‌ పట్టణంలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఫౌండేషన్ కోర్సు కోచింగ్ తీసుకుంటున్న మంచిర్యాల జిల్లాకు చెందిన స్వామిరామంతో అనే అభ్యర్థి ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం టిఫిన్ చేద్దామని స్నేహితులు పిలిచారు. తర్వాత వస్తానని చెప్పి అనంతరం భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గత నాలుగు నెలలుగా ఆయన ఆదిలాబాద్‌లో ఉంటూ శిక్షణ పొందుతున్నాడు. కుటుంబ కారణాల వల్లే స్వామిరామం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement