Advertisement

సిరిసిల్లలో గ్రీవెన్స్ డే: 36 ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ మహేష్

మన పత్రిక, సిరిసిల్ల: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఈ వారం 36 ఫిర్యాదులను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఫిర్యాదులను పరిశీలించి చట్టపరంగా సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు అందుబాటులో పోలీస్ సేవలు

ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేసే ఉద్దేశంతోనే గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేష్ తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. అవసరమైన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అందిన ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని, సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు.

Advertisement
Advertisement