TG: సిద్దిపేట ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నంగునూరు మండలం రాజగోపాల్‌పేటకు చెందిన ఆకుబత్తిని పవన్ (30) ఏడేళ్లుగా ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిన ల్యాబ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం విధులకు వచ్చిన అతను, ఆస్పత్రిలోని ఓ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు అధికారుల వేధింపులు కారణమా? లేక ఏవైనా వ్యక్తిగత సమస్యలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Lavanya is a content writer at Mana Patrika, covering useful updates and information for Telugu readers. She writes about education, jobs, current affairs, technology, entertainment, and other topics that are relevant to everyday readers. Her focus is on presenting information in a clear, simple, and easy-to-understand way.
