మన పత్రిక, శంషాబాద్: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో ఒక మహిళా ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్న సదరు ఉద్యోగిని నిత్యం ప్రయాణించే క్యాబ్ డ్రైవరే ఈ అఘాయిత్యానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.
విధులకు వెళ్తున్న సమయంలో డ్రైవర్ వాహనాన్ని ఎయిర్‌పోర్ట్ ఆవరణలోని నిర్మానుష్య ప్రాంతానికి మళ్లించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలు ధైర్యంగా ప్రతిఘటించడంతో, పట్టుబడతాననే భయంతో నిందితుడు వాహనంతో సహా అక్కడి నుండి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన విమానాశ్రయ అధికారులు, మహిళా ఉద్యోగుల రవాణా భద్రతపై అత్యవసర సమీక్ష నిర్వహించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
ఇవి కూడా చదవండి :
- అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు కేసులో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
- ఎల్‌నినో ప్రభావం నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు పక్కా ప్రణాళికలు
- జులై 22 రాశి ఫలాలు: బ్యాంకింగ్ ఉద్యోగులకు ప్రమోషన్లు
- తిరుమల భక్తులకు ముఖ్య గమనిక, సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ కీలక నిర్ణయం
- స్పిరిట్ సినిమాలో కొత్త తరహా నటనతో ఆకట్టుకోనున్న ప్రభాస్
