Advertisement

వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

మన పత్రిక: వైసీపీ నేత, మాజీ మంత్రి Seediri Appalaraju కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. తన కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారంలో పలాస కోర్టు ఆయనకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు ఆయనను జైలుకు తరలించారు.

ఈ రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని, బాధితులను ప్రలోభపెట్టారనే ఆరోపణలు సీదిరి అప్పలరాజుపై వచ్చాయి. ఈ ఆరోపణల ఆధారంగా చర్యలు తీసుకున్న అధికారులు, ఆయనను న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ ఖరారు చేసింది.

Advertisement
Advertisement