Advertisement

స్పిరిట్ తర్వాత తెలుగులో కొత్త సినిమా చేయనున్న సందీప్ రెడ్డి వంగా

మన పత్రిక: దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రభాస్ కెరీర్‌లో 25వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సుమారు 40 శాతం పూర్తయింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసేలా దర్శకుడు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

స్పిరిట్ తర్వాత వంగా మహేష్ బాబు లేదా రామ్ చరణ్‌తో కలిసి పని చేస్తారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఆయన సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే మూడు నుంచి నాలుగు ఏళ్ల వరకు ఆయన తెలుగులో మరో సినిమా చేసే అవకాశం లేదు. స్పిరిట్ తర్వాత రణబీర్ కపూర్ హీరోగా ‘యానిమల్ పార్క్’ సినిమాను, ఆ తర్వాత రణవీర్ సింగ్‌తో మరో బాలీవుడ్ చిత్రాన్ని ఆయన చేపట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement