మన పత్రిక: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే శుభవార్త వింటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 90 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు అవసరమైన అనుమతులను సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
అమర రాజా యూనిట్ ప్రారంభం
మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన అమర రాజా తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిశ్రమల యాజమాన్యాలకు ఆయన కీలక సూచనలు చేశారు. పరిశ్రమల్లో స్థానికులకే అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. పాలమూరు జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
