Advertisement

దొరసానిపల్లి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి నారా లోకేశ్

మన పత్రిక, కడప: మంత్రి నారా లోకేశ్ కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దొరసానిపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పాఠశాల పర్యటనలో భాగంగా మంత్రి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులకు మార్కులు రాకపోతే తన మార్కులు పోతాయని సరదాగా వ్యాఖ్యానిస్తూనే, వారి చదువుపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. పాఠశాల పనితీరు మరియు విద్యార్థుల హాజరుపై అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Advertisement