Advertisement

భీమవరం సభలో ప్రమాదం నుంచి బయటపడిన వైఎస్ జగన్

మన పత్రిక, భీమవరం: భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

సభ వేదికపైకి జగన్ వెళ్తున్న సమయంలో అభిమానుల తాకిడి పెరగడంతో ఆయన కాలు జారి పట్టుతప్పారు. ఈ పరిణామాన్ని గమనించిన భద్రతా సిబ్బంది మరియు అక్కడ ఉన్న నేతలు వెంటనే అప్రమత్తమై ఆయనను పట్టుకుని సురక్షితంగా నిలబెట్టారు. ప్రమాదం నుండి తేరుకున్న జగన్ చిరునవ్వుతో తన కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించారు.

Advertisement
Advertisement