Group 2 Rankers : 2015 కు చెందిన గ్రూప్ 2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 2 ఫలితాలపై ఇప్పటికే సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వారి నియామకాలు రద్దు చేయాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా డివిజన్ బెంచ్ రద్దు చేసింది. దానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేయడంతో 2015 గ్రూప్ 2 ర్యాంకర్లకు ఊరట లభించినంత పని అయింది.
సింగిల్ బెంచ్ తీర్పును టీజీపీఎస్సీ సవాల్ చేసింది. డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేయగా విచారణ చేపట్టి తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. 2015 లో గ్రూప్ 2 రాసి ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తున్నట్టు హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. దానికి కారణం.. ఆన్సర్ షీట్లలో టాంపరింగ్ జరిగిందని హైకోర్టు స్పష్టం చేసింది. అందుకే ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్టు, ఎంపిక జాబితాను కూడా కొట్టివేస్తున్నట్టు తీర్పు చెప్పింది. తాజాగా ఆ తీర్పును సీజే ధర్మాసనం సస్పెండ్ చేసింది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
