Advertisement

రామారెడ్డి మండలంలో వ్యక్తి అనుమానాస్పద మృతి

మన పత్రిక, రామారెడ్డి: రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో తాటికొండ గణేష్ (37) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులతో డబ్బుల విషయంలో గొడవ జరిగిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూమి విక్రయానికి సంబంధించిన డబ్బుల విషయమై గణేష్ తన తల్లి బుచ్చవ్వ, భార్య అపర్ణతో మాట్లాడాడు. తమ వద్ద ప్రస్తుతం డబ్బులు లేవని వారు చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం గణేష్ ఇంట్లోకి వెళ్లి తలుపులకు గడియపెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్సై మురళి తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

కేసు నమోదు చేసి దర్యాప్తు

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని ఎస్సై తెలిపారు.

Advertisement