మన పత్రిక, క్రైం: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ కాలనీలో ఇద్దరు మైనర్లపై లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. నిందితులు బాలికలకు గంజాయి మత్తు ఇచ్చి ఓ పార్కుకు తీసుకెళ్లారు. అక్కడ ఒక బాలికపై లైంగిక దాడి జరగగా, మరో మైనర్ అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. బాధితులు మహారాష్ట్రకు చెందిన వలస కూలీల కుటుంబానికి చెందినవారని స్థానికులు తెలిపారు.
సున్నితమైన అంశం కావడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు. బాధితులను సఖి కేంద్రానికి తరలించి వైద్య చికిత్సతో పాటు కౌన్సెలింగ్ అందిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సోఫీనగర్ ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
