యంగ్ స్టార్ నవీన్ పోలిశెట్టి హీరోగా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఎంటర్టైనర్ స్పెషలిస్ట్ గా పేరుతెచ్చుకున్న నవీన్ తాజాగా “అనగనగా ఒక రాజు” (Naveen Polishetty) అనే మూవీతో వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నాడు.
అయితే సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు పోటీగా ఉండడంతో వాయిదా పడే ఛాన్స్ ఉందని అనుకున్నా, తాజాగా దివాళికి మరో స్పెషల్ వీడియో రిలీజ్ చేసి ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఆ ప్రమోషన్ వీడియోలో ‘రాజు రాకెట్స్ పేరుతో దీపావళి పటాకులు అమ్ముతున్న హీరోని చూపించగా, అందులో తనదైన కామెడీ పంచులతో స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు నవీన్. ఎలాన్ మస్క్.. నుండి మోడీ వరకు అందరికి తన షాప్ నుండే బాంబులు సప్ప్లై చేసానని వీడియోలో చెప్తూ సినిమాపై మరింత హైప్ పెంచేసాడు.
ఇదిలా ఉండగా సంక్రాంతికి ఆల్రెడీ ప్రభాస్ రాజా సాబ్, చిరు మన శంకర వరప్రసాద్ తో పాటు పలు డబ్బింగ్ సినిమాలున్నా, తన సినిమాపై మాత్రం అంచనాలు తగ్గకుండా జాగ్రత్త పడుతున్నాడు పొలిశెట్టి. నిజం చెప్పాలంటే రాబోయే సంక్రాంతి సినిమాల్లో ప్రమోషన్స్ పరంగా ముందుంది ఈ సినిమానే.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
