మన పత్రిక, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లా పాలనా యంత్రాంగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. జిల్లా కలెక్టర్‌గా ఇంతకాలం పనిచేసిన ఇలా త్రిపాఠిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆమె స్థానంలో నల్గొండ జిల్లా నూతన కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్‌ను ప్రభుత్వం నియమించింది. బడుగు చంద్రశేఖర్ ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (Additional Collector)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పరిపాలనలో మంచి అనుభవం ఉన్న చంద్రశేఖర్ రాకతో జిల్లాలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయని భావిస్తున్నారు. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
