Advertisement

నల్గొండ జిల్లాలో దారుణం.. భీమారంలో గొర్రెల కాపరి హత్య

మన పత్రిక, కేతేపల్లి: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం భీమారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కంచర్ల జానయ్య (65) అనే గొర్రెల కాపరిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. శుక్రవారం రాత్రి కమ్మ బజారులోని తన గొర్రెల దొడ్డి వద్ద మంచంపై నిద్రపోతున్న ఆయనను బలమైన ఆయుధాలతో ముఖంపై దాడి చేసి చంపేశారు.

శనివారం ఉదయం జానయ్య భార్య చౌడమ్మ దొడ్డి వద్దకు వెళ్లి దుప్పటి తీసి చూడగా, రక్తపు గాయాలతో విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గొర్రెలను దొంగిలించే యత్నంలో అడ్డుకున్నాడన్న కోపంతో గానీ, లేదా ఇతర అజ్ఞాత కారణాల వల్ల గానీ ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని శాలిగౌరారం సీఐ కె. కొండల్ రెడ్డి తెలిపారు.

Advertisement

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేతేపల్లి ఎస్సై యు. సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు బృందాలు ఆధారాల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.

Advertisement