మన పత్రిక, నెల్లూరు: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై నెల్లూరుకు చెందిన చారిత్రక పత్రిక ‘జమీన్ రైతు’ ఆసక్తికరమైన, కుండబద్దలు కొట్టే విశ్లేషణను ప్రచురించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయకపోతే, అది భవిష్యత్తులో భూత్ బంగళాగా మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ప్రతిపక్ష నేత జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ (మద్రాస్-విశాఖపట్నం-గన్నవరం) ఒక సూచన కాదని, అది చంద్రబాబుకు వార్నింగ్ అని ఆ పత్రిక విశ్లేషించింది. 180 కిలోమీటర్ల మేర రోడ్డు పక్కన భవనాలు కట్టుకుంటూ పోతే పరిపాలనా సమన్వయం దెబ్బతింటుందని, ‘మావిగన్’ ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేసింది. అయితే దీన్ని అడ్డుపెట్టుకుని జగన్ అమరావతిని అడ్డుకునే వ్యూహం పన్నుతున్నారని పేర్కొంది.
రెండేళ్లయినా అమరావతి పనులు ప్రారంభం కాకపోవడం, అధికారిక ఉత్తర్వుల్లో ‘అమరావతి’ బదులు వెలగపూడి అని ఉండటంపై పత్రిక ప్రశ్నలు లేవనెత్తింది. రైతుల త్యాగాన్ని గౌరవించి, అన్ని వర్గాల ప్రజలకు అక్కడ నివాస అవకాశాలు కల్పిస్తేనే అమరావతికి జీవం వస్తుందని, లేదంటే రైతుల భూములకు విలువ లేకుండా పోతుందని చంద్రబాబుకు సూచించింది.
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
