మన పత్రిక, విజయవాడ: సోషల్ మీడియాలో అసభ్యకర కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలతో ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ భీమినేనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ (AISF) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం విజయవాడ సూర్యారావుపేటలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆమెపై అధికారికంగా ఫిర్యాదు అందజేశారు.
తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అర్ధనగ్న వీడియోలు చూడాలంటే నగదు చెల్లించి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని విష్ణుప్రియ ప్రచారం చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్ మండిపడ్డారు. టీవీ షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరై, సమాజంలో ఆదర్శంగా నిలవాల్సిన ఒక సెలబ్రిటీ.. కేవలం కాసుల కోసం కక్కుర్తిపడి ఇలాంటి అనైతిక పనులకు పాల్పడటం యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
వెంటనే విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిలిపివేయడంతో పాటు, ఐటీ చట్టం తదితర సెక్షన్ల కింద ఆమెపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నాయకులు పోలీసులను కోరారు. సెలబ్రిటీలు తమ పరిధి దాటితే న్యాయపోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు దీపక్, సిద్దు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- శంషాబాద్‌లో ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం
- అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు కేసులో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
- ఎల్‌నినో ప్రభావం నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు పక్కా ప్రణాళికలు
- జులై 22 రాశి ఫలాలు: బ్యాంకింగ్ ఉద్యోగులకు ప్రమోషన్లు
- తిరుమల భక్తులకు ముఖ్య గమనిక, సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ కీలక నిర్ణయం
