మన పత్రిక, న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (Telecom Regulatory Authority of India) వినియోగదారుల కోసం కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ప్రస్తుతం వినియోగదారులు వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎమ్ఎస్ కోసం డేటాతో కూడిన ఖరీదైన ప్లాన్లను తీసుకోవాల్సి వస్తోంది. ఈ అనవసర ఖర్చులను తగ్గించే ఉద్దేశంతో ట్రాయ్ కొత్త డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసింది.
ఈ నిబంధనలు అమల్లోకి వస్తే మొబైల్ రీఛార్జ్ ధరలు సుమారు 50 నుండి 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. కస్టమర్లు తమకు అవసరమైన సేవలను మాత్రమే ఎంచుకునే వెసులుబాటు కలుగుతుంది. స్టేక్ హోల్డర్ల అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ నిర్ణయం ద్వారా టెలికాం రంగంలో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
