Advertisement

జనగామ జిల్లాలో భూ వివాదం: పోలీస్ స్టేషన్‌లో రైతు ఆత్మహత్యాయత్నం

మన పత్రిక, తరిగొప్పుల: జనగామ జిల్లా తరిగొప్పుల పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో భూ వివాదం కారణంగా సత్రబోయిన రాజు అనే రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న తన భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు, స్టేషన్ ప్రాంగణంలోనే పురుగుల మందు సేవించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అతడిని వెంటనే జనగామ జనరల్ హాస్పిటల్ (General Hospital) కు తరలించారు.

బాధిత రైతు కుటుంబ సభ్యులు ఎస్సైపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, బాధ్యతాయుతమైన అధికారులు తమతో దురుసుగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. రిజిస్ట్రేషన్ ప్రకారం తమ భూమిని తమకే అప్పగించాలని కోరుతూ అధికారులు చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.

Advertisement
Advertisement