Advertisement

మెదక్: పోలీస్ స్టేషన్‌లో యువకుడి బలవన్మరణం

TG CRIME: మెదక్ జిల్లా రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దుర్గాప్రసాద్ (30) అనే యువకుడు గురువారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ వారం రోజుల క్రితం ఒక యువతి, ఆమె కుటుంబ సభ్యులు దుర్గాప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం పోలీసులు ఈ నెల 7న అతడిని స్టేషన్‌కు పిలిపించారు. విచారణ జరుగుతున్న సమయంలోనే దుర్గాప్రసాద్ ఠాణాలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన పోలీసులు వెంటనే అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, విచారణ సమయంలో యువతి కుటుంబ సభ్యులు తన తల్లిని తీవ్రంగా దూషించి, దాడి చేశారని, ఆ మనస్తాపంతోనే దుర్గాప్రసాద్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు, పోలీసుల తదుపరి చర్యలు తెలియాల్సి ఉంది.

Advertisement