మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఈ ఇయర్ సంక్రాంతికి విడుదలైన “మన శంకర వర ప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu) ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. నార్మల్ రీజనల్ మూవీగా విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ లో పలు రికార్డులను బ్రేక్ చేసి ఏకంగా రీజనల్ మూవీస్ పరంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాదాపు 300 కోట్లకి పైగా కలెక్షన్స్ వసూలు చేసిన ఈ మూవీతో చిరంజీవికి సాలిడ్ కం బ్యాక్ కూడా వచ్చింది.
ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) స్పెషల్ గెస్ట్ క్యారెక్టర్లో కూడా నటించడం జరిగింది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించగా, సుశ్మిత కొణిదెల, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మించారు. ఇదిలా ఉండగా తాజాగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ 100 రోజులు కూడా పూర్తి చేసుకుంది.
చిత్ర యూనిట్ నుండి అందిన సమాచారం ప్రకారం, యర్లకుంట, మైదుకూరు ప్రాంతాల్లో మన శంకర వరప్రసాద్ గారు వంద రోజుల థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ మధ్య కాలంలో వంద రోజులు జరుపుకున్న రేర్ సినిమాల్లో ఈ సినిమా కూడా చేరిపోయింది. ప్రస్తుతం చిరు విశ్వంభర తో పాటు, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
