Advertisement

వరుస హిట్లతో పారితోషికం పెంచిన మమితా బైజూ

మన పత్రిక: దక్షిణ భారత సినీ పరిశ్రమలో వరుస విజయాలు అందుకుంటున్న నటి మమితా బైజూ తన పారితోషికాన్ని పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. నివేదికల ప్రకారం, ఆమె ప్రస్తుతం ప్రతి సినిమాకు దాదాపు రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘ప్రేమలు’ సినిమాతో మమితా బైజూ విశేష ప్రజాదరణ పొంది, గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ చిత్రం సాధించిన ఘన విజయం ఆమె కెరీర్‌కు మంచి ఊపునిచ్చింది. ఇటీవల సూర్య కథానాయకుడిగా నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలోనూ ఆమె నటించారు. ఈ సినిమా భారతదేశంలో రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసి, థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైంది.

Advertisement

ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ చిత్రంలో మమిత కీలక పాత్ర పోషిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలో ఉన్నాయి. మలయాళం, తమిళ చిత్రసీమల్లో మమితకు క్రేజ్ పెరుగుతుండటంతో దర్శకనిర్మాతల నుంచి ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. వరుస హిట్లు, బడా హీరోల సరసన అవకాశాలు రావడంతో ఆమె మార్కెట్ విలువ కూడా పెరిగినట్లు సమాచారం.

Advertisement