Gas cylinder price: సిలిండర్‌పై తగ్గింపు.. కొత్త ధరలు!

Gas cylinder price

మన పత్రిక, వెబ్​డెస్క్: దేశవ్యాప్తంగా చమురు మార్కెటింగ్‌ సంస్థలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ (19 కిలోలు) ధరను స్వల్పంగా తగ్గించాయి. సిలిండర్‌పై రూ. 5 మేర తగ్గింపును ప్రకటించాయి. ఈ కొత్త ధరలు నవంబర్‌ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా తగ్గింపుతో, ఢిల్లీలో వాణిజ్య సిలిండర్‌ ధర రూ. 1,595 నుంచి రూ. 1,590కి చేరింది. ఈ నిర్ణయం హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించనుంది. అయితే, సబ్సిడీపై అందించే … Read more

Heavy Rains | భారీ వర్షం.. జలమయమైన నగరం, తడిసిన ధాన్యం!

Heavy Rains

మన పత్రిక, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో (Nizamabad District) ఆదివారం సాయంత్రం భారీ వర్షం (Heavy Rains) దంచికొట్టింది. అకస్మాత్తుగా కురిసిన వానకు నగరంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రైల్వేస్టేషన్ వద్ద డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు, ఈ అకాల వర్షం అన్నదాతలను ఆయోమయంలో పడేసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిముద్దయింది. టార్పాలిన్లు కప్పినప్పటికీ ధాన్యంలోకి నీళ్లు చేరాయి. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వర్షపు … Read more

Jobs: ప్రభుత్వ ఆసుపత్రిలో 27 నూతన పోస్టులు మంజూరు.. 

tungaturthi hospital jobs

మన పత్రిక, వెబ్​డెస్క్: తుంగతుర్తి (tungaturthi) వంద పడకల ఆసుపత్రికి 27 నూతన ఉద్యోగాలను మంజూరు చేస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని హాస్పిటల్ ఇన్చార్జి డాక్టర్ నిర్మల్ కుమార్ తెలిపారు. మంజూరైన పోస్టుల్లో గైనకాలజీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ వంటి సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ కేటగిరీలు, ఆర్ఎంఓ, అనస్తీషియా పోస్టులు ఉన్నాయి. కాగా, రూ. 40 కోట్ల వ్యయంతో 8 నెలల క్రితం ప్రారంభమైన నూతన భవన నిర్మాణం ప్రస్తుతం … Read more

Chittoor pocso case: నిందితుడికి 20 ఏళ్ల జైలు.. చిత్తూరు కోర్టు సంచలన తీర్పు!

chittoor pocso case

మన పత్రిక, వెబ్​డెస్క్: మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. చిత్తూరు ఫోక్సో కోర్టు గురువారం ఈ సంచలన తీర్పు వెలువరించింది. పిటిఎం మండలం మద్దయ్య గారిపల్లికి చెందిన పూలా నరేంద్ర రెడ్డి (31), అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను పెళ్లి పేరుతో మోసం చేశాడు. 2023 నవంబర్ 29 లోపు బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ … Read more

డీఆర్‌డీఎల్ (DRDL) డైరెక్టర్‌గా అంకతి రాజు నియామకం!

DRDL new director

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ (DRDL) నూతన డైరెక్టర్‌గా ప్రఖ్యాత శాస్త్రవేత్త అంకతి రాజు (Ankathi Raju DRDL) నియమితులయ్యారు. ఆయన ఇండియన్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంకతి రాజు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ, ఐఐటీ బాంబే నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌ (ప్రొపల్షన్)లో ఎంటెక్ పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా, పృథ్వీ, అగ్ని, మిషన్ శక్తి వంటి క్షిపణుల లిక్విడ్ … Read more

Jogi Ramesh Arrest: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్! ఏ1 వాంగ్మూలంతో..

Jogi Ramesh Arrest

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన నకిలీ (jogi ramesh liquor case) మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో సెర్చ్ వారెంట్ అందజేసిన అనంతరం అదుపులోకి తీసుకుని, ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే జోగి రమేష్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. “జోగి రమేష్ చెబితేనే నకిలీ మద్యం తయారు … Read more

High court: అత్తమామలను చూడాల్సిందే హైకోర్టు కీలక తీర్పు!

High court

మన పత్రిక, వెబ్​డెస్క్: కారుణ్య నియామకం ద్వారా భర్త ఉద్యోగాన్ని పొందిన భార్య, ఖచ్చితంగా తన అత్తమామలను చూసుకోవాల్సిందేనని రాజస్థాన్‌ హైకోర్టు జోధ్‌పూర్‌ బెంచ్‌ చారిత్రక తీర్పును వెలువరించింది. అత్తమామలతో ఉంటానని అఫిడవిట్ ఇచ్చి ఉద్యోగం పొందిన ఓ మహిళ, ఆ తర్వాత సొంత తల్లితండ్రులతో ఉండటంతో ఆమె మామ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు, ఆమె వేతనం నుంచి ప్రతినెలా రూ. 20 వేలు మామ ఖాతాలో జమ చేయాలని సంబంధిత … Read more

Telangana Bandh: కాలేజీల బంద్.. ₹900 కోట్లు బకాయిలు!

Telangana bandh november 3

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు (Telangana bandh november 3) నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వం తక్షణమే రూ. 900 కోట్లు విడుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ (FATHI) డిమాండ్ చేసింది. బకాయిల కారణంగా సిబ్బందికి జీతాలు, బిల్లులు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ బంద్‌కు ఫ్యాకల్టీ … Read more

ఏకలవ్య స్కూల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు..

Ekalavya model school outsourcing jobs

మన పత్రిక, వెబ్​డెస్క్: నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం గుండాలలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ (Ekalavya model school) పాఠశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిన సిబ్బంది నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ప్రాంతీయ సమన్వయ అధికారి కె. సుధాకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 03 మెస్ హెల్పర్స్ పోస్టులు, 01 స్టూడెంట్ కౌన్సిలర్ పోస్టును భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలను, ధ్రువీకరణ పత్రాలను … Read more

నవంబర్ 5న అతిపెద్ద సూపర్ మూన్.. ఆకాశంలో అద్భుతం!

november 5 super moon

మన పత్రిక, వెబ్​డెస్క్: ఈ నెల 5వ తేదీన ఆకాశంలో ఓ ఖగోళ అద్భుతం కనువిందు చేయనుంది. ఆ రోజు చందమామ మరింత పెద్దగా, అత్యంత కాంతిమంతంగా కనిపించనున్నాడు. ఇది ఈ ఏడాదిలోనే అతిపెద్ద ‘బీవర్ సూపర్ మూన్’ అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ రోజున చంద్రుడు భూమికి చాలా దగ్గరగా, కేవలం 3,56,980 కిలో మీటర్ల దూరానికి చేరుకుంటాడని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేదని, నేరుగా … Read more