Jubilee Hills By Poll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీజేపీ అభ్యర్థి ఖరారు

lankala Deepak reddy bjp candidate for jubilee hills by poll

Jubilee Hills By Poll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. కానీ, బీజేపీ నుంచి ఎవరిని బరిలోకి దించుతారా అని వెయిట్ చేస్తున్నారు. తాజాగా బీజేపీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థిని తాజాగా బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. లంకాల దీపక్ రెడ్డిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన … Read more

BJP and BC Leaders : బీజేపీ, బీసీ సంఘాల నేతల మధ్య కొట్లాట

bjp and bc leaders clash over photos in hyderabad

BJP and BC Leaders : బీజేపీ ఆఫీసులోనే బీజేపీ, బీసీ సంఘాల నేతల మధ్య కొట్లాట కలకలం సృష్టించింది. హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీసులో ఫోటోల విషయంలో బీజేపీ, బీసీ సంఘాల నేతలు కొట్టుకున్నారు. ఈనెల 18న రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావును కోరేందుకు ఆర్.కృష్ణయ్య, ఇతర బీసీ నేతలు వెళ్లారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో ఫోటోలు దిగే విషయంలో నేతల … Read more

Gold Rates 15 Oct 2025 : 15 అక్టోబర్ 2025, బుధవారం ఈరోజు గోల్డ్ రేట్స్

15 October 2025 Wednesday today gold rates telugu

Gold Rates Today : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 15 అక్టోబర్ 2025 బుధవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,806 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,766 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,627 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.206.10 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ లో రూ.2,06,100 … Read more

Horoscope 15 Oct 2025 : 15 అక్టోబర్ 2025 బుధవారం రాశి ఫలాలు

15 October 2025 Wednesday today horoscope telugu

Today Horoscope : 15 అక్టోబర్ 2025, బుధవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : శుభకార్యాలు చేస్తారు. దాని వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. ప్రయాణాలు చేస్తారు. దాని వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. అన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం.     వృషభం : శుభకార్యాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. అవి నెరవేరుతాయి. దూర బంధువులను కలుస్తారు. ధన లాభం ఉంటుంది. ఏ పని మొదలు పెట్టినా దాంట్లో విజయం … Read more

Bigg Boss 9 : హీటెక్కించిన ఆయేషా.. వచ్చిందిందుకేగా

Aayesha Nominates thanuja

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీ తో షో మరో మలుపు తిరిగింది. వీళ్ళ ఎంట్రీ తర్వాత జరిగిన ఫస్ట్ నామినేషన్లలోనే నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ముఖ్యంగా తమిళమ్మాయి ఆయేషా (Aayesha) అదిరిపోయే పాయింట్లతో ఫైర్ అయింది. ఆట సంగతి పక్కన పెడితే లేటెస్ట్ గా రిలీజ్ అయిన ప్రోమోలో ఆయేషా ఫైర్ ఏంటో ఇట్టే తెలుస్తుంది. తాజాగా ఈ వారం నామినేషన్ల ప్రక్రియ మొదలవగానే, … Read more

Divvela Madhuri : ఇంత అహమా.? ఇలా అయితే కష్టమే..

Divvela Madhuri

Bigg Boss Season9 : బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 9 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీ తో ఫుల్ బూస్టప్ అందుకుంటుందని నిన్నటి వరకు చాలా మంది అనుకున్నారు. కానీ వచ్చిన కంటెస్టెంట్లు ఇంతలా దిగజారి పోతారని ఎవ్వరూ గెస్ చేసి ఉండరేమో. ముఖ్యంగా దివ్వెల మాధురి (Divvela Madhuri) బయట ఎలా ఉందొ హౌస్ లో కూడా అలాగే బిహేవ్ చేస్తుందని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా రాత్రి టెలికాస్ట్ … Read more

Inter Student Missing : కాలేజీ నచ్చలేదు.. నాకోసం వెతకొద్దు.. లేఖ రాసి ఇంటర్ స్టూడెంట్ మిస్సింగ్

inter student missing from college in nizamabad

Inter Student Missing : నాకు కాలేజీ నచ్చలేదు. నన్ను వెతకొద్దు.. అంటూ లేఖ రాసి ఇంటర్ స్టూడెంట్ మిస్ అయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని బోధన్ పట్టణంలో ఉన్న విజేత జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అర్జున్ అనే విద్యార్థి తనకు కాలేజీ నచ్చలేదని.. తన కోసం వెతకొద్దని లేఖ రాసి మరీ కాలేజీ హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు … Read more

Maganti Sunita : మాగంటి సునీతకు బీఫామ్ అందజేసిన కేసీఆర్

maganti sunita receives b from from kcr

Maganti Sunita : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. జూబీహిల్స్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. ఆమెకు తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. అధికారికంగా మాగంటి సునీతను ఎన్నికల బరిలో దింపుతున్నట్టు బీఆర్ఎస్ … Read more

Telangana Rains : రైతులకు అలర్ట్.. మరో మూడు రోజులు వర్షాలు

rains continue another 3 days in telangana

Telangana Rains : ఇప్పుడిప్పుడే పంటలు కోసి ధాన్యం చేతికొస్తుంది అని రైతులు కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఇంతలోనే వర్షాలు వాళ్ల ఆశల మీద నీళ్లు పోస్తున్నాయి. ఇప్పటికే గత రెండు మూడు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల మార్కెట్లలో ఎండబెట్టిన ధాన్యం కాస్త తడిసి ముద్దయింది. ఇంకా కోయని వరి కూడా తడిసి పోయి వానకు నేలకొరిగింది. నైరుతి రుతుపవనాలు బైబై చెప్పినప్పటికీ, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల రాష్ట్రంలో … Read more

SI Suicide : పాయింట్ బ్లాంక్‌ రేంజ్‌లో గన్‌తో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య

SI commits suicide by shooting himself in haryana

SI Suicide : పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తన రివాల్వర్ తోనే కాల్చుకొని ఓ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది. హర్యానాలోని సైబర్ డివిజన్ లో సందీప్ పని చేస్తున్నాడు. అయితే.. ఇటీవలే హర్యానాలోనే ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చేసుకున్న కొన్ని రోజులకే సందీప్ ఆత్మహత్య చేసుకోవడంతో హర్యానా పోలీస్ శాఖ ఉలిక్కిపడింది. అయితే.. పూరన్ కుమార్ ఆత్మహత్య తర్వాత ఆయనపై అవినీతి … Read more