Today Horoscope : 15 అక్టోబర్ 2025, బుధవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : శుభకార్యాలు చేస్తారు. దాని వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. ప్రయాణాలు చేస్తారు. దాని వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. అన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం.
వృషభం : శుభకార్యాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. అవి నెరవేరుతాయి. దూర బంధువులను కలుస్తారు. ధన లాభం ఉంటుంది. ఏ పని మొదలు పెట్టినా దాంట్లో విజయం చేకూరుతుంది.
మిథునం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. మానసిక ఆందోళన మిమ్మల్ని బాధిస్తుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
కర్కాటకం : ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. తద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు.
సింహం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు చేస్తారు. ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.
కన్య : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని విషయాలు మానసిక ఆందోళనకు గురి చేస్తాయి.
తుల : ఆరోగ్యం బాధిస్తుంది. ఫుడ్ విషయంలో అజాగ్రత్త వద్దు. అనుకున్న పనులేవీ జరగవు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.
వృశ్చికం : ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. విజయం సాధిస్తారు. దైవదర్శనానికి వెళ్తారు. ప్రయాణాలు చేస్తారు. ఆస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి.
ధనుస్సు : ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మకరం : బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళన ఇబ్బందులకు గురి చేస్తుంది.
కుంభం : ప్రయాణాలు చేస్తారు. దాని వల్ల మంచి ఫలితం లభిస్తుంది. స్థిరాస్థి విషయంలో కొన్ని సమస్యలు తప్పవు. ఏ పని చేపట్టినా ఆటంకాలు వస్తాయి. నూతన కార్యాలు చేపడతారు.
మీనం : శుభవార్తలను వింటారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ధనలాభం ఉంటుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
