Advertisement

కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి: భట్టి విక్రమార్క

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు సేవలు అందించాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసనసభలో సభ్యుల ఆందోళనల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సభ తరఫున సభ్యులందరూ సంయమనం పాటించి తమ తమ స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రభుత్వం గానీ, సభలోని సభ్యులు గానీ కేసీఆర్‌ గారి చావును ఎన్నడూ కోరుకోవడం లేదని భట్టి అన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని తాము హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సభలో అభిప్రాయాలను వ్యక్తపరిచే సమయంలో సభ్యులందరూ సభా మర్యాదలను కాపాడాలని, శాసనసభ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉప ముఖ్యమంత్రి కోరారు.

Advertisement
Advertisement