మన పత్రిక, వెబ్‌డెస్క్: నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool) కల్వకుర్తిలో(Kalwakurthy) దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన పూజారి శ్రీనివాస శర్మ నివాసంలో భారీ చోరీ జరిగింది. నవంబర్ 30న కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఊరెళ్లగా, సోమవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి.
బీరువాను పరిశీలించగా, అందులో దాచిన సుమారు 40 తులాల బంగారు ఆభరణాలు, రూ. 6 లక్షల నగదు అపహరణకు గురైనట్లు శ్రీనివాస శర్మ గుర్తించారు. యజమానులు లేని సమయం చూసి దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
