Advertisement

కేంద్రంపై ఆధారపడకుండా ఆదాయం పెంచండి: ఎంపీ కంగనా రనౌత్‌

కేంద్రం నుంచి నిధుల కోసం అడుక్కునే పరిస్థితి రాకుండా రాష్ట్రంలోనే ఆదాయ మార్గాలను పెంచుకోవాలని మండి ఎంపీ, BJP నాయకురాలు కంగనా రనౌత్‌ అధికారులకు సూచించారు. మండి నియోజకవర్గంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆమె, అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చేతులు ముడుచుకుని కూర్చుంటే పనులు జరగవు. అధికారులు ముందడుగు వేసి ఇతర రాష్ట్రాల అభివృద్ధి విధానాలను అధ్యయనం చేయాలి’’ అని స్పష్టం చేశారు.

‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్’ కార్యక్రమానికి ప్రాధాన్యమివ్వాలని, రాష్ట్రంలో ఉన్న ప్రతిభను ఆదాయ మార్గాలుగా మలచాలని కోరారు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. కేంద్ర నిధులతో చేపట్టిన భూభూ జోత్‌ టన్నెల్‌, పిఎంజిఎస్ వై ప్రాజెక్టుల క్రెడిట్‌ను కాంగ్రెస్‌ ఖాతాలో వేసుకునేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. అధికారుల పనితీరు మారకపోతే వారిపై కేంద్రానికి అధికారిక నివేదిక పంపుతానని హెచ్చరించారు.

Advertisement
Advertisement