Advertisement

కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను వెంటనే ఆన్ చేయాలి: హరీష్ రావు

మన పత్రిక, తిమ్మాయిపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను వెంటనే ఆన్ చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు (MLA Harish Rao) డిమాండ్ చేశారు. నంగునూర్ మండలం తిమ్మాయిపల్లిలో జరిగిన పెద్దమ్మ దేవాలయ ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సద్బుద్ధి ప్రసాదించాలని కోరారు. కన్నెపల్లి పంప్ హౌస్ (Kannepally Pump House) మోటార్లను ఆన్ చేస్తే సిద్దిపేట నియోజకవర్గంలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కృత్రిమ కరువు అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈర్ష్యతోనే నీటి విడుదల ఆపేసిందని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement