Advertisement

ప్రజలే దేశ సంపద, పిల్లలే భవిష్యత్తు: ముఖ్యమంత్రి చంద్రబాబు

మన పత్రిక, విజయవాడ: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనాభా ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని, ప్రజలతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. జనాభా నియంత్రణ విధానాల నుంచి జనాభా సంరక్షణ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు.

పిల్లలే అసలైన సంపద అని, అందుకే ‘పిల్లలే సంపద’ (Children are Wealth) పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం ప్రకటించారు. యువత నైపుణ్యం, వృద్ధుల అనుభవం దేశానికి ఆస్తి అని ఆయన కొనియాడారు. ఉమ్మడి కుటుంబాలే మేలని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను మార్చే అంశంపై సీఎం సంకేతాలు ఇచ్చారు. జనాభా వృద్ధిపై ప్రభుత్వం భవిష్యత్తులో కీలక మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

Advertisement
Advertisement