Advertisement

ఫిన్లాండ్‌లో మణిదీప్ అదృశ్యం కేసులో కీలక మలుపు

మన పత్రిక, ఫిన్లాండ్: హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి మణిదీప్ అదృశ్యమైన కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ ఘటనలో లభ్యమైన మృతదేహం మణిదీప్‌దేనని స్థానిక పోలీసులు నిర్ధారించగా, అది తమ కుమారుడిది కాదని కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు తీరుపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మణిదీప్ ఆచూకీ కోసం తల్లిదండ్రులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కేసుపై స్పష్టమైన సమాచారం కోసం సంబంధిత అధికారులు దర్యాప్తును వేగవంతం చేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
Advertisement