Harish Rao : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. బతుకమ్మ చీరలను రాష్ట్రంలో ఉన్న అందరు ఆడపడుచులకు కాకుండా కేవలం మహిళా సంఘాల గ్రూపుల్లో ఉన్న మహిళలకే ఇస్తున్నారని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కోటి 30 లక్షల మంది మహిళలకు చీరలు ఇచ్చారని.. రేవంత్ రెడ్డి మాత్రం 46 లక్షల మంది మహిళలకు మాత్రమే ఒక చీర ఇచ్చాడన్నారు.
కేసీఆర్ హయాంలో ప్రతి బతుకమ్మ పండుగకు అందరు మహిళలకు చీరలు వచ్చేవని.. రేవంత్ రెడ్డి వచ్చాక రెండు పండుగలు పోయాయి.. ఇప్పుడు మహిళా సంఘాల గ్రూపుల్లో ఉన్న మహిళలకు మాత్రమే ఒక చీర వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ఒక చీర ఇచ్చి సారె పెట్టిన అంటున్నాడు. చీరతో పాటు బాకీ పడ్డ రూ.60 వేలు కూడా ప్రతి మహిళకు ఇస్తే అదే నిజమైన సారె పెట్టడం అని హరీశ్ రావు దుయ్యబట్టారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
