మన పత్రిక: విజయవాడలో జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్‌పై ఓ యువతి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. తనను స్లిమ్ చేస్తానని దగ్గరై, మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి, నగ్న ఫోటోలు తీశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అబ్దుల్ ఖాదర్ తాజాగా సోషల్ మీడియాలో వీడియో ద్వారా స్పందించారు.
తనపై వచ్చిన ఆరోపణలను ఖాదర్ పూర్తిగా ఖండించారు. సదరు యువతి తనను ట్రాప్ చేసి, తనకు క్యాన్సర్ ఉందని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిందని ఆయన ఆరోపించారు. యువతి తనను హోటల్ గదికి పిలిపించి, మద్యం తీసుకురావడానికి డబ్బులు కూడా పంపిందని, అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా, యువతి తల్లి కూడా ఫోన్ చేసి తమ కూతురి కోరిక తీర్చాలని కోరిందని ఆయన పేర్కొన్నారు. యువతి ప్రవర్తనపై అనుమానం వచ్చి తాను దూరం పెట్టడంతోనే తనపై తప్పుడు కేసులు పెట్టారని, ఆమె తల్లిదండ్రులు డబ్బుల కోసం వేధిస్తున్నారని ఖాదర్ ఆరోపించారు. ఈ వేధింపుల కారణంగా తాను ఆత్మహత్యకు సిద్ధమయ్యానని, తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను పోలీసుల ముందు ఉంచుతానని ఆయన స్పష్టం చేశారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- కేంద్ర ప్రభుత్వానికి సీజేపీ జాతీయ ప్రతినిధి హెచ్చరిక
- షూటింగ్ మొదలవ్వకముందే భారీ రికార్డు సృష్టించిన ధనుష్ కొత్త సినిమా
- అమ్రాబాద్‌లో డిప్యూటేషన్‌పై వెళ్లిన ఉపాధ్యాయులను వెనక్కి పిలవాలని ఎమ్మెల్యే ఆదేశం
- ఢిల్లీలో కాకరోచ్ జనతా పార్టీ నిరసనలు: పది కేసులు నమోదు చేసిన పోలీసులు
- తెలంగాణలో మరికొంత కాలం కొనసాగనున్న వర్షాలు
