Advertisement

పసిడికి బ్రేక్‌.. తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్న స్వల్పంగా పెరిగిన పసిడి రేటు ఇవాళ చల్లబడింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,040 తగ్గి రూ.1,54,310కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.950 పడిపోయి రూ.1,41,450 వద్ద నమోదైంది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద విక్రయమవుతోంది. వివిధ ప్రాంతాలు, స్థానిక పన్నులను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు వెల్లడించారు. ఈ ధరలపై 3 శాతం జీఎస్టీ అదనంగా వర్తిస్తుంది.

Advertisement