Advertisement

Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!

Infosys దేశవ్యాప్తంగా (PAN India) 2026 బ్యాచ్ ఫ్రెషర్స్ కోసం భారీ ఆఫ్‌ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. Specialist Programmer Trainee మరియు Digital Specialist Engineer Trainee పోస్టులకు BE, BTech, ME, MTech, MCA, MSc అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్మెంట్‌ లో ఆకర్షణీయమైన ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నారు. Specialist Programmer (Trainee) రోల్స్‌ కు ₹10 LPA నుంచి ₹21 LPA వరకు ప్యాకేజ్ ఉండగా, Digital Specialist Engineer (Trainee) పోస్టుకు ₹6.25 LPAతో పాటు ₹75,000 జాయినింగ్ బోనస్ అందిస్తున్నారు.

Advertisement

కంప్యూటర్ సైన్స్, IT, డేటా సైన్స్, AI/ML, సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో చదువుతున్న 2026 పాస్‌ఔట్స్ ఈ అవకాశానికి అర్హులు. ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది — మొదట ఆన్‌లైన్ అసెస్‌మెంట్, తర్వాత ఆఫ్‌లైన్ టెస్ట్ & ఇంటర్వ్యూ. రెండు దశల్లోనూ ప్రోగ్రామింగ్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు.

అభ్యర్థులు తప్పనిసరిగా వ్యక్తిగత ఈమెయిల్‌ తో అప్లై చేయాలి. అప్లికేషన్ అప్లైకు చివరి తేదీ మే 4, 2026గా నిర్ణయించారు. IT రంగంలో హై ప్యాకేజ్‌తో కెరీర్ ప్రారంభించాలనుకునే ఫ్రెషర్స్‌కు ఇది గోల్డెన్ ఆపర్చ్యూనిటీగా మారింది.

Advertisement