Advertisement

బర్త్ సర్టిఫికెట్ తప్పుతో మమితా బైజుగా పేరు మార్పు

ప్రేమలు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటి మమితా బైజు తన పేరు వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఆమె తల్లిదండ్రులు మొదట నమిత అని పేరు పెట్టాలని భావించినప్పటికీ, జనన ధ్రువీకరణ పత్రంలో జరిగిన పొరపాటు వల్ల అది మమితగా మారింది.

బర్త్ సర్టిఫికెట్ నమోదు సమయంలో మొదటి అక్షరం ‘N’ కు బదులుగా ‘M’ అని తప్పుగా పడింది. స్కూలులో చేర్పించే సమయంలోనే కుటుంబ సభ్యులు ఈ తప్పును గమనించారు. అప్పటికే అధికారిక పత్రాల్లో నమోదవడంతో ఆ పేరునే కొనసాగించారు. మలయాళంలో మమిత అంటే తీపి అని అర్థమని, ఈ అనుకోకుండా వచ్చిన పేరు తన గుర్తింపుగా మారడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.

Advertisement
Advertisement