Advertisement

మైసా సినిమా తొలి పాట ‘ఓ మైసా రే’ విడుదల

రష్మిక మందన్న నటిస్తున్న ‘మైసా’ సినిమా నుంచి మొదటి పాట ‘ఓ మైసా రే’ నవంబర్ 2న విడుదలైంది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామా గోండ్ గిరిజన సమాజం నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది. రష్మిక ఇందులో తీవ్రమైన ఎమోషనల్, యాక్షన్ రోల్‌లో కనిపిస్తున్నారు.

అటవీ నేపథ్యంలో ఊరమాస్ ప్రదర్శన

ఈ పాటను జేక్స్ బిజోయ్ స్వరపరచగా, తెలుగు వెర్షన్‌కు సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. సింధుజ శ్రీనివాసన్ పాడిన ఈ పాటకు బృందా మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. అటవీ నేపథ్యంలో అనేక మంది డ్యాన్సర్లతో కలిసి రష్మిక చేసిన ప్రదర్శన పాటలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Advertisement

ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 నవంబర్ 27న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement