బిగ్ బాస్ సీజన్ 9 (Bigg boss season 9) ఆరో వారం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగా, వైల్డ్ కార్డు కంటెస్టెంట్లతో రోజుకో గొడవ, గంటకో ఎంటర్టైన్మెంట్ టాస్కులతో అదిరిపోతోంది. శ్రీజ ఎలిమినేట్ అయ్యాక ఆటలో పస తగ్గుతుందనుకున్నా, వైల్డ్ కార్డు ఫైస్ట్రోమ్స్ అలా అవ్వకుండా ఆటను మరింత రసవత్తరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో తాజాగా ఓ అపరిచితుడు ఎంటరయ్యాడు. అయితే ఆ అపరిచితుడు బయటి వాడేమి కాదు, హౌస్ లోపలి వాడే.
అసలు విషయానికొస్తే ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో భాగంగా హౌస్ లో ఇమ్మాన్యుయల్ (Emmaneol) మాంచి ఫన్ జన్రేట్ చేస్తున్నాడు. హౌస్ లో రమ్య మొక్ష (Ramya Moksha) చక్కగా లంగా వోణి డ్రెస్ లో ఎంట్రీ ఇవ్వగా, రమ్య వెంటపడుతూ, ఇమ్మాన్యుయెల్ అపరిచితుడు లో రామానుజం లా ఎంట్రీ ఇచ్చి అబ్బుర పరిచాడు. తనదైన స్టయిల్లో కామెడీ పండిస్తున్నాడు.
ఇక బిగ్ బాస్ హౌస్ లో అన్ని విభాగాల్లో ఇమ్మాన్యుయేల్ అదరగొడుతుండగా, వోటింగ్స్ పరంగా కూడా టాప్ లో ఉన్నాడు. అయితే ఈ వారం నామినేషన్ లో లేడు. ఇక ఈ ఆరో వారం ఎవిక్షన్ కి దగ్గరగా రాము రాథోడ్, దివ్య, సుమన్ శెట్టి ఉన్నట్టు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
