Advertisement

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమిరేట్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమిరేట్స్ (Emirates) సంస్థ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్ధన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఎమిరేట్స్ విమాన సేవలను మరింత విస్తరించాలని సీఎం కోరారు.

రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కొత్తగా రెండు విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా విమానయాన రంగంలో వస్తున్న మార్పులను ఆయన వివరించారు. సంస్థ ప్రతినిధులు కూడా రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ భేటీ ద్వారా తెలంగాణలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. విమానయాన రంగంలో పెట్టుబడులు, సేవల విస్తరణ అంశాలే ప్రధానంగా ఈ సమావేశం కొనసాగింది.

Advertisement
Advertisement