Advertisement

టీచర్ పోస్టులకు విద్యార్హతలు, టెట్ తప్పనిసరి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: సరైన విద్యార్హతలు, ‘టెట్’ లాంటి నిర్దేశిత అర్హతలు లేని ఉపాధ్యాయులను నియమించవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అర్హత లేని టీచర్లతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అస్సాం టీచర్ రిక్రూట్‌మెంట్‌ కేసులో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అర్హతలు లేకుండా టీచర్ల నియామకాలు చేపట్టడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అస్సాంలో అర్హత లేని టీచర్ల నియామకంపై మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ మొత్తాన్ని సమగ్రంగా సమీక్షించాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement