Advertisement

Ebola Deaths : కాంగో దేశంలో ఎబోలా వైరస్ మహమ్మారి దాటికి 930 మంది మృతి

మన పత్రిక: మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మే 15 నుంచి శనివారం నాటికి దేశవ్యాప్తంగా 2,344 కేసులు నమోదయ్యాయని, దాదాపు 930 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేవలం శుక్రవారం నుంచి 24 గంటల వ్యవధిలోనే 37 మరణాలు నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులన్నీ బుండిబుగ్యో ఎబోలా రకానికి చెందినవని ప్రభుత్వం ప్రకటించింది.

వైరస్ వ్యాప్తి మరియు లక్షణాలు

ఎబోలా వైరస్ జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాల నుంచి మనుషులకు సోకుతుంది. వ్యాధి సోకిన జంతువుల మాంసాన్ని తినడం ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఒకసారి వైరస్ సోకిన తర్వాత లక్షణాలు కనిపించడానికి 21 రోజుల సమయం పడుతుంది. ప్రారంభంలో ఫ్లూ, మలేరియా, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ అవయవాల వైఫల్యం సంభవించే ప్రమాదం ఉంది. కొన్ని కేసుల్లో శరీర లోపల, బయట రక్తస్రావం జరగడం కూడా గమనించవచ్చు. వైరస్ బారిన పడిన వ్యక్తి శరీర ద్రవాల ద్వారా ఇతరులకు ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. ప్రస్తుతం ఈ వైరస్‌ను అరికట్టేందుకు ఎటువంటి వ్యాక్సిన్ లేదా చికిత్స అందుబాటులో లేదని ఆరోగ్యశాఖ తెలిపింది.

Advertisement
Advertisement