TTD: తిరుమల శ్రీవారి డిసెంబర్ నెల ఆర్జిత సేవల టికెట్ల ఆన్‌లైన్ విడుదల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానంప్రకటించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 21 ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. డిప్‌లో ఎంపికైన భక్తులు 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి.
కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్లను 22న ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. 23న అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, వృద్ధులు, దివ్యాంగుల ఉచిత దర్శన టోకెన్లు విడుదలవుతాయి. 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు గదుల కోటా విడుదలవుతుంది. భక్తులు tttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని తితిదే సూచించింది. కాగా, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం చంద్రబాబును తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర తదితరులు ఆహ్వానించారు.
Lavanya is a content writer at Mana Patrika, covering useful updates and information for Telugu readers. She writes about education, jobs, current affairs, technology, entertainment, and other topics that are relevant to everyday readers. Her focus is on presenting information in a clear, simple, and easy-to-understand way.
