మన పత్రిక, హైదరాబాద్: సైబర్ మోసగాళ్లకు బ్యాంక్ అకౌంట్లు సరఫరా చేస్తున్న జీడిమెట్లకు చెందిన 27 ఏళ్ల డెలివరీ బాయ్ దిలీప్ సింగ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్, ఆన్‌లైన్ గేమింగ్, పార్ట్‌టైమ్ జాబ్ మోసాలు, స్టాకింగ్ వంటి నేరాల కోసం ఈ మ్యూల్ ఖాతాలను వినియోగించినట్లు అధికారులు దర్యాప్తులో నిర్ధారించారు.
నిందితుడు సేవింగ్స్ అకౌంట్‌కు రూ.25 వేలు, కరెంట్ అకౌంట్‌కు రూ.50 వేలు తీసుకుంటూ సైబర్ నేరగాళ్లకు ఏటీఎమ్, సిమ్ కార్డులు అందించేవాడు. 2024లో ఇన్‌స్టాగ్రామ్ ప్రకటన ద్వారా పరిచయం ఏర్పడిన తర్వాత, నేరగాళ్లు వాట్సాప్ ద్వారా ఇతనితో లావాదేవీలు నడిపారు. అరెస్టు సమయంలో దిలీప్ వద్ద నుంచి రూ.1.02 లక్షల నగదు, 3 మొబైల్ ఫోన్లు, 12 డెబిట్ కార్డులు, ఒక క్రెడిట్ కార్డ్, 3 పాస్‌బుక్‌లు, 7 చెక్‌బుక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖాతాలు తెరవడంలో సహకరించిన బ్యాంకు ఉద్యోగుల పాత్రపై విచారణ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్‌లో పడిపోయిన రియల్ ఎస్టేట్: కొనుగోలుదారులు లేక ఖాళీగా ఫ్లాట్లు
- Petrol Diesel price hike : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: దిల్లీలో రూ. 100 దాటిన రేటు
- నేటితో ముగియనున్న టీజీ దోస్త్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువు
- తెలంగాణలో తొలి గాజు వంతెన.. హుస్నాబాద్‌లో ముమ్మరంగా పనులు
- బండ్లగూడలో తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి గుర్తింపు..
